Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైట్ మాస్టర్ రాజు మృతి

Webdunia
WD
బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఫైట్ మాస్టర్ స్థాయికి ఎదిగిన రాజు సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

రాజు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని వేటపాలెం. అగ్రహీరోలైన ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి వంటి వారి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి ఖైదీలో కొత్తగా ఫైట్స్ కంపోజ్ చేసి ట్రెండ్ సృష్టించారు.

ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రవి కూడా ఫైటరే. కానీ రెండు చిత్రాల్లో హీరోగా నటించాడు. చార్మినార్ చిత్రంలో ఆయన హీరో. రాజు శిష్యులు ఎందరో సినీ రంగంలో ఉన్నారు. ఆయన భారీకాయుడైనప్పటికీ ఫైట్స్ చేయడంలో సునాయసంగా చేసేవారు.

రాజు మృతి సందర్భంగా తెలుగు చలనచిత్ర ఫైటర్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయనతో తమకు గల సంబంధాన్ని మననం చేసుకుంది. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా సంతాపాన్ని తెలియజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments