తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే నెల 9వ తేదీ నుంచి ఎంసెట్‌తోపాటు పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తేదీలను కూడా నిర్ణయించింది.
ఇందులో ఇంజినీరింగ్ విభాగ పరీక్ష 4 రోజులపాటు 8 విడతల్లో, అగ్రికల్చర్ విభాగ పరీక్ష 2 రోజులపాటు 4 విడతల్లో జరగనుంది. అలాగే పీజీ ఈసెట్ 8 విడతల్లో(4 రోజులు), ఐసెట్ 3 విడతల్లో(రెండు రోజులు), ఎడ్ సెట్ 3 విడతల్లో (రెండు రోజులు) నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రాల్లో కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాలను భారీగా పెంచారు.
అలాగే, విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక జిల్లా కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరయ్యేలా అవకాశమిచ్చారు.
ఈ నెల 31న ఈసెట్‌తో ప్రారంభం కానున్న పరీక్షలు.. అక్టోబరు 4న జరిగే లాసెట్‌తో ముగియనున్నాయి. పరీక్షలకు మొత్తం 4,00,728 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.