Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్యూటీపార్లర్ ముసుగులో సెక్స్ రాకెట్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అరెస్ట్..

దేశంలో మహిళలపై దురాగతాలు జరుగుతుంటే... మరోవైపు సెక్స్ రాకెట్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా బ్యూటీ పార్లర్ల ముసుగులో వ్యభిచార ముఠా నడుస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ గుట్టును రట్టు చేశారు.

బ్యూటీపార్లర్ ముసుగులో సెక్స్ రాకెట్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అరెస్ట్..
, మంగళవారం, 15 నవంబరు 2016 (12:33 IST)
దేశంలో మహిళలపై దురాగతాలు జరుగుతుంటే... మరోవైపు సెక్స్ రాకెట్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా బ్యూటీ పార్లర్ల ముసుగులో వ్యభిచార ముఠా నడుస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ గుట్టును రట్టు చేశారు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... హయత్‌నగర్‌కు చెందిన వీరస్వామి మూసారాంబాగ్‌లో ఓ బ్యూటీపార్లర్ నడుపుతున్నాడు. ఇతడితో పాటు ఏపీలోని ఏలూరు, తెలంగాణలోని నల్గొండ ప్రాంతాలకు చెందిన శ్రీకాంత్, దామోదర్‌లతో కలిసి పనిచేస్తున్నారు. కానీ బ్యూటీ పార్లర్ ముసుగులో అతను వ్యభిచార వ్యాపారం జరుగుతోంది. 
 
దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో.. బ్యూటీ పార్లర్‌పై దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విటులుగా వచ్చిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను అరెస్ట్ చేశారు. నలుగురు యువతులకు విముక్తి కలిగించారు. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో ఏపీ, బెంగళూరు, కోల్ కతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న వీరస్వామి, శ్రీకాంత్, దామోదర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో ఉన్న విభేదాల వల్లే సంధ్యారాణి సూసైడ్ చేసుకుంది.. ప్రొఫెసర్ లక్ష్మి వాదన