హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగుడా యూనియన్ బ్యాంక్, దక్కన్ గ్రామీణ బ్యాంకులలో అఫ్రైజర్‌గా పని చేస్తున్న సాయినాథ్ అలియాస్ సాయి, రెండు కోట్ల తొంబై ఒక లక్ష కాజేశాడు. 2016 నుండి బ్యాంకులో అఫ్రైజర్‌గా పని చేస్తున్న సాయి తనకు సన్నిహితంగా ఉండే వారితో అకౌంట్లు తెరిపించి వారి నుండి నఖీలి బంగారం తాకట్టు పెట్టించి కోట్లు కాజేసి జల్సాలు చేశాడు.
2016లో యూనియన్ బ్యాంక్‌లో సాయినాథ్ అఫ్రైజర్‌గా పనిచేస్తుండగా తుక్కుగుడా అదే బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్‌కు వ్యవహారం తెలిసింది. అతనికి కూడా డబ్బులు ఎరజుపి సాయి అతని తన వైపుకు తిప్పుకున్నాడు. రెండు మూడు సంవత్సరాల తరువాత సునీల్ కుమార్ బదిలిపై మరో బ్యాకుకు వెళ్లడంతో డిప్యూటీ మేనేజర్‌గా ప్రదీప్ కుమార్ ఉన్నాడు.
సాయినాథ్ వ్యవహారం కాస్త ప్రదీప్ కుమార్‌కు తెలియడంతో అతనికి కూడా వాట ఇచ్చి తనవైపుకు లాక్కుని పని కానిస్తున్నాడు. ముగ్గురు కలిసి 96 అకౌంట్లు తెరిచి రెండు కోట్ల తొంబై లక్షలు కాజేశారు. ముగ్గురు వచ్చిన డబ్బులను జల్సాల కోసం ఉపయోగించడమే కాకుండా సాయి 54 లక్షలతో ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు కారు, మోటర్ సైకిల్ కొన్నాడు.
సాయితో కుమ్మక్కయిన మేనేజర్ సునీల్ కుమార్ మరియు డిప్యూటీ మేనేజర్ ప్రదీప్ కుమార్‌లు వచ్చిన డబ్బుతొ ప్లాట్లు కొనుక్కోవడం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సాయి, యూనియన్ బ్యాంకులోనే కాకుండా తుక్కుగుడాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా నకిలీ బంగారంపై 54 లక్షలు కాజేసినట్లు పొలీసులు గుర్తించారు.
పాత మేనేజర్ సునీల్ కుమార్ బదిలీపై నిజాంబాద్ జిల్లా బాల్కొండ వెళ్లడంతో ఇతని స్థానంలో వచ్చిన యశ్వంత్ రెడ్డి. పూర్తి వ్యవహారాన్ని తెలుసుకొని బ్యాంక్ ఉన్నతాధికారులకు తెలియజేయగా రంగంలోకి దిగిన బ్యాంక్ సిబ్బంది జరిగిన విషయంపై పూర్తి సమాచారాన్ని పహాడీషరీఫ్ పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు బ్రెజా కారు, మోటారు వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.