Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్ హోస్టెస్ మృతి: పోలీసుల అదుపులో భర్త!

ఎయిర్ హోస్టెస్ మృతి: పోలీసుల అదుపులో భర్త!
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:10 IST)
హైదరాబాద్ ఇందిరా నగర్‌లో నివశిస్తూ వచ్చిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రీతును ఆమె భర్తే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
కుటుంబ కలహాలే కారణం కావొచ్చునని పలువురు అనుమానిస్తున్నారు. ఆమె తలకు బలమైన గాయం అయినట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం తర్వాత వివరాలు తెలుస్తాయి రీమా రాత్రి చనిపోయి పడి ఉందని, రాత్రి పూట ఆసుపత్రికి తీసుకు వెళ్లామని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే రీతు అనే యువతి మాజీ ఎయిర్‌హోస్టెస్. ఈమె భర్త పేరు సచిన్. వీరిది ప్రేమ వివాహం. 2013లో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి స్వస్థలం జార్ఖండ్. పెళ్లైన తర్వాత ఆమె ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వీరిద్దరు ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్‌లో నివశిస్తూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ప్రియ ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందగా, సోమవారం ఇరుగుపొరుగు వారు కనుగొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు.. ప్రియ తలపై గాయం ఉన్నట్టు గుర్తించారు. ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu