వలసరాజ్యాల కాలం నాటి పరిభాషకు దూరంగా ఉండే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు తెలంగాణ ప్రభుత్వం రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా, రాజ్ నివాస్‌ను లోక్ నివాస్‌గా పేరు మార్చాలని నిర్ణయించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి మార్పులను అమలు చేశాయి.
ఇప్పుడు తెలంగాణ ఆ జాబితాలో చేరనుంది. వలస వారసత్వం కంటే ప్రజాస్వామ్య, స్వదేశీ విలువలను ప్రతిబింబించే పేర్లను స్వీకరించాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది.
2024లో జరిగిన గవర్నర్ల సమావేశంలో ఈ ప్రతిపాదన ఉద్భవించింది. ఇందులో పాల్గొన్నవారు రాజ్ భవన్ అనే పదం వలసవాదానికి మచ్చగా ఉంది. స్వతంత్ర భారతదేశం నైతికతకు అనుగుణంగా లేదని సూచించారు.
అయితే రాజ్భవన్ల పేర్లు మార్చాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలపై.. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశవ్యాప్తంగా గవర్నర్ నివాసాలైన రాజ్భవన్లను లోక్‌భవన్‌గా (ప్రజల భవన్), రాజ్ నివాస్‌లను లోక్ నివాస్‌గా పేరు మార్చడంపై స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.