తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఠాగూర్
మంగళవారం, 2 డిశెంబరు 2025 (17:19 IST)
తెలంగాణ రాష్ట్ర రాజ్‌భవన్ పేరు మారింది. ఇకపై రాజ్‌భవన్ స్థానంలో లోక్‌భవన్‌గా పిలువనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం దేశంలోని అన్ని రాజ్‌భవన్‌ల పేర్లను మార్చుతూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో తమిళనాడు రాజ్‌భవన్ పేరును మక్కల్ భవన్‌గా మార్చారు. 
 
అలాగే, ఇపుడు తెలంగాణ రాష్ట్ర రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిది. అన్ని రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
వలసవాద వాసనలను తుడిచిపెట్టేందుకు.. రాజ్‌ భవన్, రాజ్‌ నివాస్‌ల పేర్లను లోక్‌ భవన్, లోక్‌ నివాస్‌లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లకు సూచిస్తూ ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇప్పటికే పశ్చిమబెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం ఈ పేరు మార్పుపై ఆచితూచి స్పందిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments