Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం : మంత్రి కోమటిరెడ్డి

komatireddy

వరుణ్

, మంగళవారం, 23 జనవరి 2024 (16:04 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా, వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణాను అప్పులపాలు చేసిందని, ఈ కారణంగానే తాము ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతుందని చెప్పారు. 
 
మంగళవారం గాంధీ భవన్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఇందులో మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీప్  దాస్ మున్షీ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చించారు. 
 
ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇతర హామీలను నెరవేర్చామని, మిగిలిన వాటిని నిర్ణీత గడువు లోగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని చెప్పారు. హమీల అమలుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడివుండే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. 
 
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి కోమటిరెడ్డి 
 
వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భారత రాష్ట్ర సమితికి చెందిన 39 మంది ఎమ్మెల్లో 30 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇపుడు భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో లోక్‌సభ ఎన్నికల తర్వాత దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని చెప్పారు. 
 
భారాస పార్టీలో ఒకవైపు, బావాబామ్మర్ధులు కొట్టుకుంటున్నారని, మరోవైపు, తండ్రికొడుకులు, ఇంకోవైపు, సంతోష్ రెడ్డి - కేటీఆర్ ఇలా ఎవరికివారు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకునే అవకాశం కూడా లేదని ఆయన జోస్యం చెప్పారు. పైపెచ్చు.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఖాళీ కాబోతుందన్నారు. 
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదనీ, తమ పార్టీ ప్రభుత్వాన్ని మేమెందుకు కూల్చుకుంటామని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల సారథ్యంలో ముందుకు వెళుతూ రాష్ట్ర ప్రజానీకానికి సుస్థిర పాలన అందిస్తామని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తనపై అవాకులు చెవాకులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఆయనకు సపర్యలు చేసుకోవాలని సలహా ఇచ్చారు. అక్రమ మద్యం వ్యాపారం చేసుకుంటూ వచ్చిన జగదీశ్... గత పదేళ్ల కాలంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనాన్ని లూఠీ చేసిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2024లో genAIలో పెట్టుబడి పది మందిలో ఏడుగురు సీఈవోలు..