పండగ సీజన్‌లో రద్దీ నివారణ కోసం ప్రత్యేక రైళ్లు

ఠాగూర్
ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (11:05 IST)
పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికులకు శుభవార్త చెబుతూ భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లేవారి సౌకర్యార్థం మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
 
పండగల సమయంలో సాధారణ రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ప్రయాణికుల తాకిడిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు పలు కీలక నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, మధురై-బరౌని మధ్య 12, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-బరౌని మధ్య 12, షాలిమార్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య 10 రైళ్లు నడుస్తాయి.
 
అదేవిధంగా, ఎస్ఎంవీటి బెంగళూరు - బీదర్ మధ్య 9, తిరునెల్వేలి - శివమొగ్గ టౌన్ మధ్య 8 సర్వీసులు నడుపనుంది. వీటితో పాటు తిరువనంతపురం నార్త్ - సంత్రాగచి మధ్య 7, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచి మధ్య 3 రైళ్లు కూడా నడుస్తాయని అధికారులు వివరించారు. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టేషన్లు, టికెట్ లభ్యత వంటి పూర్తి వివరాల కోసం ప్రయాణికులు రైల్వే అధికారిక వెబ్ సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments