కోర్టులో పిస్టోరియస్ దొంగ ఏడుపులు.. నటనలో శిక్షణ తీసుకున్నాడట!
, బుధవారం, 23 ఏప్రియల్ 2014 (12:17 IST)
తన ప్రియురాలిని కాల్చిచంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ నటనలో శిక్షణ తీసుకున్నాడని, అందుకే కోర్టులో దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ కేసు విచారణలో భాగంగా పిస్టోరియస్ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ గట్టిగా ఏడవడంతో పాటు వాంతులు చేసుకున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం గమనార్హం. దక్షిణాఫ్రికా కాలమిస్టు జాని అలన్, పిస్టోరియస్పై ఈ ఆరోపణలు చేసింది."
నాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోర్టు విచారణకు ముందు నువ్వు నటనలో శిక్షణ తీసుకున్నావు. నీతో నటింపజేసేందుకు కోచ్ చాలా కష్టపడ్డాడు" అని తన వెబ్సైట్లో పిస్టోరియస్ను ఉద్దేశించి అలన్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ ఆరోపణలను ఆస్కార్ కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు.