Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెబాస్టియన్ వెటల్ : డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ దిశగా..

సెబాస్టియన్ వెటల్ : డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ దిశగా..
FILE
రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈసారి డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకునే దిశగా దూసుకెళుతున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రీ రేసును కైవసం చేసుకున్న ఈ 26 ఏళ్ల జర్మన్ డ్రైవర్ చాంపియన్‌షిప్‌ను అందుకునే దిశగా తన ప్రత్యర్థులకంటే ముందున్నాడు.

ద్వితీయ స్థానాన్ని ఆక్రమించిన ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలొన్సో కంటే వెటెల్ 16.869 సెకన్ల ముందుగానే లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.

కాగా, పోల్ పొజిషన్ సంపాదించిన హామిల్టన్ లూయిస్ (మెర్సిడెజ్) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెరీర్‌లో 54వ పర్యాయం పోడియం ఫినిష్ చేసినప్పటికీ అతడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu