Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుఎస్ ఓపెన్ : సింగిల్స్ మెయిన్ డ్రాకు సోమదేవ్ క్వాలిఫై!

యుఎస్ ఓపెన్ : సింగిల్స్ మెయిన్ డ్రాకు సోమదేవ్ క్వాలిఫై!
FILE
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు భారత ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ అర్హత సంపాదించాడు. చివరి క్వాలిఫయింగ్ రౌండ్‌లో అతను బ్రిటన్ ఆటగాడు జేమ్స్ వార్డ్‌ను 6-3, 3-6, 6-4 తేడాతో ఓడించాడు.

రెండు గంటల, 15 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సోమ్‌దేశ్ ఒక సెట్‌ను కోల్పోయినప్పటికీ, చివరి వరకూ శ్రమించి వార్డ్‌పై గెలిచాడు. యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో అతను స్లొవేకియాకు చెందిన 85వ ర్యాంక్ ఆటగాడు లుకాస్ లాకోను ఢీ కొంటాడు.

Share this Story:

Follow Webdunia telugu