Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరాట్ కోహ్లీపై ఒత్తిడి పెట్టొద్దు : సచిన్ టెండూల్కర్

విరాట్ కోహ్లీపై ఒత్తిడి పెట్టొద్దు : సచిన్ టెండూల్కర్
, బుధవారం, 21 మార్చి 2012 (17:24 IST)
IFM
FILE
భారత యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి పెట్టొద్దని బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. విరాట్ చాలా మంచి ఆటగాడు. అలాగే, ఎంతో తెలివైన క్రికెటర్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయినప్పటికీ.. అతనిపై ఒత్తిడి పెట్టొద్దని, అతిని యధేచ్చగా ఆడనివ్వాలని సచిన్ చెప్పుకొచ్చాడు.

గత నెల రోజుల వ్యవధిలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి... అనితరసాధ్యమైన ఛేజింగ్‌లలో భారత్‌కు విజయాన్ని అందించి పెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో శ్రీలంక విధించిన 320 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 37 ఓవర్లలో సుసాధ్యం చేశాడు. ఈ మ్యాచ్‌లో 86 బంతుల్లో 133 పరుగులు చేశాడు.

అలాగే, ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఉంచిన 329 పరుగుల విజయలక్ష్యాన్ని కూడా ఒంటిచేత్తో అవలీలగా ఛేదించిన క్రికెటర్ యూవీ. ఈ మ్యాచ్‌లో 183 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టాడు. దీంతో విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌లో ధృవతారగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో.. ఢాకా నుంచి బుధవారం స్వదేశానికి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాట్లాడుతూ...ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాలని ఆశిస్తాం. కానీ, అది సాధ్యం కాదు. కొన్ని సమయంలో ప్రత్యర్థి జట్టు మనకంటే బాగా ఆడుతుంది. అదే బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ క్రెడిట్‌ను దూరం చేయలేను. వారు మైదానంలో మంచి ఆటతీరును ప్రదర్శించారన్నారు.

News Summar : Virat Kohli is a very good player. He is a brilliant player. He has done well but all I can say is don't put pressure on him. Let him play," said Sachin Tendulkar.

Share this Story:

Follow Webdunia telugu