వెస్టిండీస్‌తో ముంబైలో జరుగుతున్న మూడో టెస్టులో "ది వాల్" రాహుల్ ద్రవిడ్ సంప్రదాయ టెస్టుల్లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మూడో టెస్టు మూడో రోజైన గురువారం రాహుల్ ద్రవిడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15వేల 86 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానాన్ని ద్రవిడ్ 13వేల పరుగులను పూర్తి చేయడం ద్వారా సొంతం చేసుకున్నాడు.
1996లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడిన ద్రవిడ్‌కి తర్వాత స్థానాలను ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్, దక్షిణాఫ్రికా క్రికెటర్ కలిస్‌లు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాహుల్ ద్రవిడ్, తన టెస్టు కెరీర్‌లో 159 టెస్టులాడాడు. టెస్టుల్లో 36 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఇంకా టెస్టులు, వన్డేల్లో కూడా పదివేల పరుగులు పూర్తి చేసిన భారత క్రికెటర్‌గా ద్రవిడ్ నిలిచాడు.