Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాషెస్ సిరీస్: నాలుగో టెస్టుకు పాటింగ్ అనుమానమే!!

యాషెస్ సిరీస్: నాలుగో టెస్టుకు పాటింగ్ అనుమానమే!!
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే రోజైన ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు ఆసీస్ కెప్టెన్ రికీపాంటింగ్ అందుబాటులో ఉండే విషయంపై నెలకొన్న సందేహాలు ఇంకా వీడలేదు. పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో రికీ పాంటింగ్ చేతి వేలికి గాయమైన విషయం తెల్సిందే.

ఇది పెద్దగాయమేమీ కాకపోయినప్పటికీ.. బ్యాట్ పట్టుకునేందుకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో శనివారం పూర్తిగా బ్యాటింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ ప్రాక్టీస్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేస్తే నాలుగో టెస్టుకు ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

దీనిపై పాటింగ్ స్పందిస్తూ తాను పూర్తి ఫిట్‌గానే ఉన్నాను. అయితే, తన ఫీల్డింగ్ స్థానమైన రెండో స్లిప్ నుంచి మిడాఫ్‌కు మారనున్నట్టు చెప్పాడు. ఇకపై రెండో స్థానంలో ఫీల్డింగ్ చేయనని, దానికి బదులు మరోస్థానంలో ఉంటాననిని చెప్పాడు. అలాగే, నా చేతి వేలు కూడా బాగానే ఉందన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu