Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన శుభదినమే దీపావళి!

శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన శుభదినమే దీపావళి!
FILE
ఆశ్వయుజ మాస బహుళ చతుర్ధశిని 'నరక చతుర్ధశి' అని, ఆ మరుసటి రోజును 'దీపావళి' అమావాస్య అని అంటారు. ఇది పిన్నలకూ, పెద్దలకూ సరదా పండుగ. తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించడం, పిండివంటలతో భోజనం చేసి, సాయంత్రం కాగానే దీపాల్ని వరుసగా వెలిగించి, అనంతరం టపాకాయలు కాల్చడం ఈ పండుగకు ఆనవాయితి. నరకాసుర సహారం జరిగినందుకు ఆనంద సూచకంగ జరుపుకునే ఈ పండుగ ప్రధానంగా లక్ష్మీ పూజాదినంగా జరుపుకోబడుతోంది.

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగానూ శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా దీపావళిని చెప్పుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu