Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యుడుకి క్షీరాన్నం నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగిపోతుంది!!

సూర్యుడుకి క్షీరాన్నం నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగిపోతుంది!!
, సోమవారం, 31 మార్చి 2014 (18:52 IST)
File
FILE
"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ 1
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశానం 2
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ 1
స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవ"

అనే ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే.. ఐదు సంవత్సరాల అఘఘర్షణ స్నానఫలం లభిస్తుంది. సూర్యుడు మకరంలో ఉండే సమయం (మాఘమాసంలో) సూర్యోదయానికి ముందు ఇంట్లోనే స్నానం చేస్తే ఆరు సంవత్సరాల అఘఘర్షణ స్నానఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అదే మాఘమాసంలో బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యస్నాన ఫలాన్ని, మహానదీ సంగమ స్నానం చేస్తే చతుర్గణం, గంగా యమునా సంగమ (త్రివేణీ సంగమ) స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తుందని పండితులు అంటున్నారు.

మాఘ మాసంలో ప్రతినిత్యం మాత్రమే కాకుండా మాఘమాస పాఢ్యమి, విదియ, తదియ తిథులలో పై శ్లోకాన్ని ఉచ్చరించి, పిదప స్నానం చేయడం ఆరోగ్యదాయకమని పండితులు పేర్కొంటున్నారు.

ఇంకా.. మాఘమాసాల్లో వచ్చే ఆదివారాల్లో నియమబద్ధంగా సూర్యుడికు క్షీరాన్నం వండి నివేదించితే రోగ, దారిద్ర్యాలు తొలగిపోతాయి. మాఘమాసపు ఆదివారాల్లో మాంసం, ఉల్లి, వెల్లుల్లి తినడం కూడదు. అదేవిధంగా మాఘమాసం పూర్తిగా ముల్లంగి ఆహారంగా తీసుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu