Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వల్ప దానమూ... అక్షయ ఫలప్రదం

స్వల్ప దానమూ... అక్షయ ఫలప్రదం
, గురువారం, 8 మే 2008 (20:15 IST)
అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల కొనుగోలు జోరందుకున్నాయి. రాష్ట్రరాజధానిలోనే కాక విజయవాడ, వరంగల్, గుంటూరు, తిరుపతి, విశాఖపట్టణం వంటి ప్రాంతాలలో బంగారు నగల కొనుగోళ్లు జరిగాయి. ఈ సందర్భంగా అక్షయ తృతీయ గురించిన పురాణగాథను చూద్దాం. పూర్వం ఓ వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా, సత్ప్రవర్తన వీడేవాడు కాదు. ఇతని పరిస్థితిని చూసి పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయనాడు చేసే స్వల్పమైన దానమైననూ అక్షయ ఫలప్రదమని చెప్పాడు.

ఆ రోజున అతను పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృ దేవతలకు తర్పణమాచరించి, పేదవారికి భోజనము పెట్టి తాంబూలములతో దానమిచ్చాడు. అలా ఆనాడు ఆచరించిన పుణ్యఫలమే అతని వెంటవచ్చి మరుసటి జన్మములో కుశావతీ నగరానికి రాజుగా జన్మించాడు. ఆ జన్మలో అతను ఎన్ని దానధర్మాలు చేసినా సంపద తరగలేదట.

Share this Story:

Follow Webdunia telugu