Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇష్ట దైవానికి జామపండు నైవేద్యంగా పెడితే రాజగౌరవం!

ఇష్ట దైవానికి జామపండు నైవేద్యంగా పెడితే రాజగౌరవం!
, సోమవారం, 14 ఏప్రియల్ 2014 (14:52 IST)
File
FILE
ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవానికి పూజలు చేసే సమయంలో ఏదో ఒక పండును నైవేద్యంగా ఉంచుతారు. అయితే, దేవునికి జామపండుతో పాటు.. ఇతర పండ్లను నైవేద్యంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లను దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయి. ద్రాక్ష పండును దేవునికి నైవేద్యంగా పెట్టి చిన్నపిల్లలకు ఇచ్చి తర్వాత పెద్దలకు పంచితే సుఖం సంతోషం ఎప్పుడూ ఉంటాయి. అలాగే దేవుని పూజకు జామపండు నైవేద్యంగా పెడితే జీవితంలో రాజగౌరవం, అందరి నుంచి సత్కారాలు లభిస్తాయి.

శ్రీ గణపతికి జామపండును నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. దేవీ దేవాలయానికి జామ కాయను నైవేద్యంగా పెట్టి సుమంగళులకు పండ్లను అందిస్తే చక్కర వ్యాధి తగ్గిపోతుంది. జామపండులను పెళ్లికాని అమ్మాయిల చేతి మీదుగా పూజ చేయించి సుమంగుళులకు తాంబూలం ఇస్తే అబ్బాయి తరుపువారు వచ్చి అమ్మాయిను పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తారు.

గౌరీ పూజకు నైవేద్యంగా ఉంచి పూజించిన జామపండును తింటే మనస్సులోని కోరిక నెరవేరుతుంది. జామపండ్లను దుర్గాదేవికి దీప నమస్కారాలు చేసే సమయంలో నైవేద్యం చేసి పిల్లలు లేని వారికి ఇస్తే సంవత్సరం లోగా సంతానం అవుతుంది. ధన్వంతరి హోమంలో పూర్ణాహుతికి జామపండ్లు వేస్తే చక్కెర వ్యాధి దీర్ఘకాలం నుంచి నయం కాని వ్యాధులు తొలగిపోతాయి.

పిల్లలకు జామపండ్లు తినేందుకు ఇస్తే పెద్దల మనో వ్యాధి తొలగిపోతోంది. జామపండ్లను శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి నైవేద్యంగా పెట్టి వచ్చిన దంపతులకు తినేందుకు ఇస్తే దాంపత్యంలోని కలహాలు తొలగిపోతాయి. సంకష్ట హర గణపతికి జామపండ్లను నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి దానం చేస్తే ఆరోగ్య భాగ్యం దేహంలోని నీరసం తొలగిపోతోంది.

రుద్రాభిషేకం సమయంలో జామపండ్ల రసాన్ని కమలా పండు రసాలతో దేవునికి అభిషేకం చేసి ఇతరులకు పండును తినేందుకు ఇస్తే నిదానంగా జరుగుతున్న పనులు మీ మనసుకు ఇష్టమైన రీతిలో త్వరగా జరుగుతాయి. తాంబూలంతో పాటు జామపండ్లను సంకల్ప సమేతంగా పూజ చేసి దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృత అభిషేకం జరిపి ప్రార్థన చేసి దేవునికి కుడివైపు ఉంచే ప్రార్థిస్తే వ్యాపారంలో అధిక లాభం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu