Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటిపై తేలియాడే విగ్రహం...

నీటిపై తేలియాడే విగ్రహం...
WD
దాదాపు ఏడు కేజీల బరువు ఉన్న విగ్రహం నీటి మీద తేలియాడగలదా? విగ్రహం నీటిమీద తేలియాడటం లేదా మునిగిపోవడం అనే ప్రక్రియలను అనుసరించి రాబోయే సంవత్సరంలో గ్రామస్తులకు జరిగే మంచి చెడులు నిర్ణయమవుతాయా? ఏది‌నిజం శీర్షికలో భాగంగా ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలను కనుగొనేందుకు మాతో రండి...

మధ్యప్రదేశ్‌లో హాత్‌పిప్లియా అనే చిన్న పట్టణం ఉంది. ఇది దేవస్ జిల్లాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరమూ నరసింహ ఆలయంలోని స్వామి విగ్రహం నీటి మీద తేలుతుంది. ఈ అద్భుతాన్ని మేం కెమెరాలో చిత్రీకరించాము.

ప్రతి సంవత్సరం డోల్ గ్యారాస్ -భాడవ మాసం 11వ రోజు ఉత్సవం సందర్భంగా నరసింహస్వామి విగ్రహానికి పూజ చేసిన తర్వాత దానిని నదీజలాల్లో వదిలిపెడతారు. ఆశ్చర్యకరంగా విగ్రహం నీటిలో తేలియాడుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తజనం ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు.
webdunia
WD


ఆయన మాతో మాట్లాడుతూ.. స్వామి విగ్రహం ఒకే ఒక్క సారి నీటిలో తేలియాడిందంటే రాబోయే సంవత్సరంలో నాలుగు నెలల పాటు సంపదలు కూడతాయని చెప్పారు. ఇలా విగ్రహం మూడుసార్లు తేలియాడిందంటే సంవత్సరం మొత్తం శుభం జరుగుతుందని జనం నమ్మకమని పూజారి చెప్పారు.

ఆ గ్రామనివాసి సోహన్‌లాల్ మాట్లాడుతూ, ఈ మొత్తం ఉదంతాన్ని గత 20 ఏళ్లుగా తాను చూస్తూ వస్తున్నానని చెప్పాడు. నరసింహ స్వామి విగ్రహంపై గ్రామ ప్రజలకు అపార విశ్వాసం ఉందని పేర్కొన్నాడు.

webdunia
WD
ఈ ఆలయంలోని మరో పూజారి కూడా మాతో మాట్లాడారు. ఈ గుడిలో దేవుడి అద్భుతానికి తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. ఆలయ పూజారులుగా తాము విగ్రహాన్ని నీటిలో ముంచితే అది ఆశ్చర్యకరమైన రీతిలో పైకి తేలుతూ ఉంటుందని చెప్పారు.

ఈ విగ్రహాన్ని నీటిలోకి మూడుసార్లు మాత్రమే వదిలిపెడతారు. గత సంవత్సరం అది రెండు సార్లు నీటిపై తేలియాడిందని, ఈ సంవత్సరం అది ఒకసారి మాత్రమే తేలియాడిందని చెప్పారు.

వేసవికాలంలో నది ఎండిపోయినప్పటికీ, డోల్ గ్యారాస్ ఉత్సవానికి ముందు వానలు పడి నది నీటితో నిండుతుందని గ్రామప్రజల విశ్వాసం. ఈ సారి మాత్రం నదిలో ఏ మాత్రం నీళ్లు లేవని ఇలా ఎన్నడూ జరగలేదని కలవరపడుతున్నారు.

నదిలో విగ్రహం తేలియాడటం వెనుక హేతువు ఏమై ఉంటుంది... దైవ విగ్రహం యొక్క సహజ స్వభావం కారణంగా ఇలా జరుగుతోందా లేక నిజంగా దేవుడి మహిమే ఇందుకు కారణమా... ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో మాకు తెలుపండి.

Share this Story:

Follow Webdunia telugu