Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గృహాన్ని ఎల్ ఆకారంలో నిర్మిస్తున్నారా? దోషం తప్పదు!!

గృహాన్ని ఎల్ ఆకారంలో నిర్మిస్తున్నారా? దోషం తప్పదు!!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (17:16 IST)
File
FILE
సాధారణంగా ఇంటి నిర్మాణాలను కేవలం చతురస్ర, దీర్ఘ చతురస్ర ఆకారంలో మాత్రమే చేప్టటాలని వాస్తుశాస్త్రాలు చెబుతున్నాయి. పై ఆకారాల్లో ఇళ్లను నిర్మించని పక్షంలో ఆ గృహాలపై దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు చెపుతున్నారు. అందువల్ల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, కార్యాలయాల నిర్మాణంలో వాస్తు ప్రకారం ఒక విధమైన షేప్‌పై ఆధారపడటం మంచిది.

చతురస్ర, దీర్ఘచతురస్ర ఆకారాల్లోనే కాకుండా నిర్మాణానికి పరిమితంలేని విధంగా ఇళ్లు ఉంటే అశుభ ఫలితాలు తటస్థిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. హద్దుదాటి నిర్మించిన గృహం, సీత గీత దాటిన చందంగా ఉంటుందని వారు చెబుతున్నారు.

అందుచేత గృహాలు నిర్మించటంలో జాగురూకతతో వాస్తు ప్రకారం షేప్‌ను పాటించి నిర్మించటం మంచిది. ప్రస్తుతం మీ ఇల్లు 'ఎల్' ఆకారంలో ఉంటే ఇంటిలోని గదులు అలాగే నిర్మించటం అంత మంచిది కాదు. రెండు ఎల్‌షేప్‌లు కలవడం కూడదు. రెండు ఎల్‌షేప్‌లు కలిసి దీర్ఘచతురస్రాకారం కావడం చేస్తుంది.

అయితే ఒక 'ఎల్‌' షేప్ మాత్రమే వాస్తుశాస్త్రంలో అసంపూర్ణత చిహ్నంగా శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. దీనితో నిర్మాణంలో అసంపూర్ణత లోపిస్తుంది. అందుచేత మన గృహాలకు సహాయాన్ని అందించే ప్రకృతి సిద్ధమైన శక్తులను దూరం చేసుకునే పరిస్థితి కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇప్పటికే మీ ఇళ్లల్లో 'ఎల్‌' ఆకారముంటే ఆ ఆకారాన్ని మార్చేవిధంగా దీర్ఘ చతురస్రం వచ్చేలా స్థలానికి ఒకమూల మొక్కను గాని, లేదా ఏదైనా పోల్‌ను నిర్మించటం మంచిది. ఇలా చేస్తే కొంత దుష్ప్రయోజనాల నుంచి దూరంగా ఉండవచ్చునని వాస్తుశాస్త్రం చెబుతోంది.

కాబట్టి ఇంటి నిర్మాణం చతురస్రం, లేదా దీర్ఘచతురస్ర ఆకారాన్ని మాత్రమే కలిగియుండాలి. అలా లేని పక్షాన విద్యా విషయంలో సమస్యలు ఏర్పడటం, కుటుంబంలో భాగస్వాముల మధ్య స్పర్దలు ఏర్పడతాయని వాస్తుశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu