Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంటగదిని ఎక్కడ నిర్మించాలి...?

వంటగదిని ఎక్కడ నిర్మించాలి...?
సాధారణంగా ఇంటి నిర్మాణం కాంట్రాక్టర్‌కే అప్పగిస్తుంటాం. ఎందుకంటే మనకు సమయం ఉండదు, దీంతో బాటు శ్రమకూడా తగ్గిపోతుందని వారికే అప్పచెబుతుంటాము. దీంతో వారు ఇష్టం వచ్చినట్లు కట్టేసి మనకు తాళాలు చేతికి ఇస్తుంటారు. కాని ఇంటి నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం కట్టుకున్న ఇంటిలో శుఖంగా కాపురం చేయవచ్చంటున్నారు వాస్తు నిపుణులు.

వంటగదిలో రోజుకు మూడు నుంచి ఐదు గంటల వరకు అగ్గి మండుతుంటుంది. అంటే నిప్పుతో వంట చేసుకుంటుంటాం. వంట చేయాలంటే నిప్పు తప్పనిసరి. ఇంట్లోని ఆగ్నేయంలో తూర్పు ముఖంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే వంట చేసేవారు తూర్పుముఖంగా నిలబడి వంట చేసేలా ఏర్పాటు చేసుకోవాలి.

కాని కొన్ని ఇండ్లలో వంట గది ఈశాన్యం దిక్కులో ఉంటుంది. ఇది ఆగ్నేయానికి చాలా విరుద్ధం. నిప్పుతో చేసే పనులు, వంట తదితరాలు అన్నీకూడా ఆగ్నేయంలోనే ఉండాలి. ఆగ్నేయంలో కాకుండా మరే దిక్కులోనైనా ఉంటే ఇంట్లో ఐకమత్యం ఉండదు.

ముఖ్యంగా ఈశాన్యంలో వంటగది ఉంటేమాత్రం ఇంట్లోని పెద్ద కుమారునిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో అతను ఇంట్లో నివసించకుండా వేరే ప్రాంతంలో నివసించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలావుండగా ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య పరిస్థితికూడా ఏమంతగా బాగుండదని అంటున్నారు వాస్తు నిపుణులు.

ఈశాన్యం దిక్కు దైవికమైనది. కాబట్టి ఇక్కడ పూజలు తదితర పవిత్రమైన కార్యక్రమాలు చేయాల్సిన చోటులో వంటగది నిషిద్ధం. ఈశాన్యం దిశలో మీకు వీలైతే స్టడీ రూంను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి దిశలో భగవంతుని పటాలు లేదా విగ్రహాలు ఉంచి పూజలు చేయడం ఎంతో ఉత్తమం. వీటిని దృష్టిలో ఉంచుకుని వంటగది నిర్మాణం చేస్తే ఇల్లు శుఖ శాంతులతో గడుస్తుందంటున్నారు వాస్తు నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu