ఆనందమయ జీవితానికి ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం ఒత్తిళ్ళ నుంచి, అలజడుల నుంచి బయటపడేస్తుంది. నాడీ మండలాన్ని, మీ మనసును పటిష్టం చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి అన్ని విధాలుగానూ సమర్థుల్ని చేస్తుంది. శరీరంలో తగ్గిపోయే శక్తిని నింపుకునేందుకు ఏకైక మార్గం ధ్యానం.
దినసరి చర్యలతో పాటు.. ధ్యానానికి కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. ఇది ప్రతి వ్యక్తి ఆత్మోద్ధరణకు అవసరం. ఇలా చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇది జీవితానికి చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రతి వ్యక్తి అనుభవించే యాంత్రిక జీవితంలో ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల ధ్యానం తప్పనిసరి. ఎక్కువ బాధ్యతలో, ఉన్నత ఆకాంక్షలో ఉన్నవారైతే, ఎక్కువగా ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది.
భారతదేశంలో ఒక సూక్తి ప్రాచుర్యంలో ఉంది. అదిః సాత్వికత ద్వారానే పనులు జరుగుతాయి. వస్తువుల ద్వారా జరగవు. ధ్యానం, యోగా మన సామర్థ్యాన్ని, గుణ గణ సంపదను, కౌశల్యాన్ని పెంపొందిస్తాయి. పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తిగా ధ్యానంలోకి వెళ్లండి. ఉన్నతమైన జ్ఞానానికి, వివేకానికి, సంఘంలో ఉపయోగకరమైన పనులు చేయడానికి మీ సమయాన్ని వినియోగించండి.
ప్రతి వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ప్రశాంతంగా జీవించాలని ఆరాటపడుతాడు. చుట్టూ ఉన్నవారికి ఉపయోగపడాలి. వివేకం సంతోషాన్ని ఇక్కడే ఇప్పుడే కలిగిస్తుంది. అందువల్ల జీవితాన్ని కళ అన్నాం. మన మనసును, మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని సద్దుకుని, దానికి అనుగుణంగా జీవించడమే వివేకం.