Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజా మందిరంలో చీకటి అలుముకుంటే?

పూజా మందిరంలో చీకటి అలుముకుంటే?
, శుక్రవారం, 5 డిశెంబరు 2014 (17:22 IST)
పూజామందిరాన్ని పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటారు. కొంతమంది పూజగది ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. మరికొంతమంది వంటగదిలో భాగంగా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
 
ప్రతినిత్యం పూజా మందిరాన్ని వివిధరకాల పుష్పాలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అయితే పూజామందిరం దగ్గర కూర్చుని పూజ పూర్తిచేసిన తరువాత ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతుండటం జరుగుతూ ఉంటుంది.
 
కానీ పూజా మందిరంలో చీకటి అలుముకుని ఉండకూడదని పురోహితులు చెబుతున్నారు. పూజా మందిరంగానీ పూజ గది గాని చీకటిగా ఉండటం వలన అనేక అనర్థాలు జరుగుతాయట.
 
ఈ కారణంగానే కొంతమంది తమ ఇంట్లో అఖండ దీపారాధనకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కాస్తంత ఓపిక, తీరిక ఉన్నవాళ్లు దీపారాధన కొండెక్కకుండా చూసుకోవచ్చు. అవకాశం లేనప్పుడు పూజ గదిలోను పూజా మందిరంలోను నిరంతరం విద్యుత్ దీపాలు వెలిగే ఏర్పాట్లు చేసుకోవచ్చు.
 
ఈ విధంగా చేయడం వలన, పూజామందిరాన్ని చీకటిలో ఉంచడం వలన కలిగే దోషాల నుంచి బయటపడవచ్చు. అనునిత్యం ఎవరి ఇంటనైతే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట కొలువై ఉండటానికి లక్ష్మీదేవి ఆసక్తిని చూపిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.

Share this Story:

Follow Webdunia telugu