Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్కాటక రాశి వారి ఫలితాలు 2018లో ఎలా వున్నాయంటే?

కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదము (హె) పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హు, హె, హో, డా), ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో). ఆదాయం-8 వ్యయం-2, పూజ్యత -7, అవమానం- 3. ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మమము మీద రాహువు, సప్తమము నందు కేతువు, అక్టోబర్ 11వ

కర్కాటక రాశి వారి ఫలితాలు 2018లో ఎలా వున్నాయంటే?
, గురువారం, 28 డిశెంబరు 2017 (12:52 IST)
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదము (హె) పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హు, హె, హో, డా), ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో). ఆదాయం-8 వ్యయం-2, పూజ్యత -7, అవమానం- 3. 
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మమము మీద రాహువు, సప్తమము నందు కేతువు, అక్టోబర్ 11వ తేదీ వరకు చతుర్థము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా పంచమము నందు, ఈ సంవత్సరం అంతా షష్ఠమము నందు శని సంచరిస్తారు.
 
మీ గోచారం పరిశీలించగా "బుద్ధిం తపది తేజస్య'' అన్నట్లుగా జ్ఞానవంతుడు, యోగ్యుడు, ఎల్లప్పుడు పురోభివృద్ధిని, గుర్తింపుని పొందుతారు. జన్మంలో రాహువు సంచారం వల్ల భార్యా పుత్రులతో కొంత విముఖత ఏర్పడినప్పటికీ మీ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయముల యందు ఆదాయం సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికి ఉపయోగకరంగా ఉంటాయి. 
 
విలువైన వస్తు వాహనాలు అమర్చుకుంటారు. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. భాగస్వామ్యులతో విబేధాలు, అవమానాలు అపనిందలు ఎదుర్కొంటారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఓర్పు, సహనంతో ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు ఇతర ప్రాంతాలు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య బాధలు అధికంగా వుంటాయి. ఆరోగ్యంలో ఏమాత్రం సంతృప్తి కానరాదు. 
 
ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బందుల పడుతుంటారు. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. ప్రతిపని స్వయంగా చేసుకోవడం వల్ల అధిక లాభాలు పొందగలుగుతారు. గురుబలం దృష్ట్యా పుణ్య కార్యములు, తీర్థ యాత్రలు, ధార్మిక కార్యక్రమములు, సాంఘీక కార్యక్రమములు, విజ్ఞాన వినోద కార్యక్రమములలో పాల్గొంటారు. 
 
రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బందీ అంటూ ఏదీ ఉండదు. ఇతరులు మోసం చేసేందుకు యత్నిస్తారు జాగ్రత్త వహించండి. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు ధరలు అధికం కావడం వల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారు ఒత్తిడి అధికమైన లాభాలు పొందే ఆస్కారం వుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళ, క్రీడా రంగాల్లో వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి.
 
నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. తాము అనుకున్న ఉద్యోగాలు పొందగలుగుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యవసాయదారులకు అనుకున్నంత లాభాలు వుండవు. ఫలితం కంటే శ్రమ అధికంగా ఉన్నందువల్ల కొంత నిరుత్సాహానికి లోనవుతారు. రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. షేర్ వ్యాపారులు ప్రతి అంశాన్ని ఓర్పుగా పరిశీలించి ముందుకు సాగితే మంచిది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అధిక శ్రమ పట్టుదల అవసరం. అధిక కృషి చేసినప్పటికీ సామాన్యమైన ఫలితాలు పొందుతారు.
 
మీ నిర్ణయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు కలిసివస్తాయి. కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగినట్లైతే శుభం కలుగుతుంది. ప్రయాణ విషయాల్లో కొంత చికాకులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. 
 
కాంట్రాక్టర్లతో, వర్కర్స్‌తో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. ముఖ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి విషయంలో ఆలోచించి వ్యవహరించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆడిట్, అకౌంట్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం అంతా నూతనోత్సాహంతో ముందుకు సాగి సత్ఫలితాలు పొందండి. 
 
* ఈ రాశివారు ''వైద్యనాధుని'' అభిషేకించి, ఆరాధించిన సర్వదా జయం చేకూరుతుంది. శారదాదేవి పూజించిన విద్యార్థులకు పురోభివృద్ధి లభిస్తుంది. 
 
* పునర్వసు నక్షత్రం వారు ''కనకపుష్యరాగం'', పుష్యమి నక్షత్రం వారు "పుష్యనీలం", ఆశ్లేష నక్షత్రం వారు ''గరుడ పచ్చ" ధరించిన శుభం కలుగుతుంది. 
 
* పునర్వసు నక్షత్రం వారు ''గన్నేరు చెట్టు''ను, పుష్యమి నక్షత్రం ''పిప్పలి చెట్టు'' ఆశ్లేష నక్షత్రం వారు ''బొప్పాయి'' చెట్టును, దేవాలయాల్లో గాని, విద్యా సంస్థల్లో గానీ, ఖాళీ ప్రదేశాల్లోగానీ నాటినట్లైతే శుభం, జయం, పురోభివృద్ధి కలుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిథున రాశి వారి ఫలితాలు, 2018లో ఇలా వున్నాయి