గర్లఫ్రెండ్స్ కోసం దొంగవేషాలు... పోలీసులకు చిక్కిన మాజీసైనికుడు!
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (14:13 IST)
అతడో మాజీ సైనికుడు. తన ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ కోసం దొంగగా మారాడు. వారితో సినిమాలు, షికార్ల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టేందుకు బ్యాంకు దోపిడీలకు పాల్పడుతూ చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా అతను ఓ బ్యాంకులో కన్నంవేస్తూ పోలీసులకు చిక్కాడు.హిమాచల్ ప్రదేశ్‌లోని షియోపూర్‌కు చెందిన రాజ్ వత్ అనే వ్యక్తి ఆర్మీలో 7 సంవత్సరాల పాటు జవానుగా పనిచేశాడు. దోపిడీలకు పాల్పడే టెక్నిక్‌లు నేర్చాడు. తర్వాత దోపిడీలు మొదలుపెట్టాడు. దోచుకున్న డబ్బుతో తన ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేవాడు. ఆ డబ్బు అయిపోగానే మరో బ్యాంకుకు కన్నంవేసేవాడు. ఈ క్రమంలో అతడు యూకో బ్యాంకు నుంచి 36 లక్షల రూపాయలు దోచుకొని పారిపోతుండగా, అతడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఇప్పటివరకూ తాను 9 బ్యాంకుల్లో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో చెబుతున్నాడు. అంతేకాకుండా తాను ఈ దొంగతనాల్లో ఇద్దరు స్నేహితుల సాయం కూడా తీసుకునేవాడినని బయటపెట్టాడు.