Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేనెక్కడికీ వెళ్లను... ఇక్కడే ఇల్లు కొంటున్నాను: హేమమాలిని!

నేనెక్కడికీ వెళ్లను... ఇక్కడే ఇల్లు కొంటున్నాను: హేమమాలిని!
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (13:00 IST)
FILE
నేను శ్రీకృష్ణుడి భక్తురాలిని అందుకే మథుర నియోజక వర్గం నుంచిపోటీ చేస్తున్నానని సీనీయర్ నటి, బీజేపీ మధుర అభ్యర్థి హేమమాలిని చెప్పారు. తాను ఎన్నికల అనంతరం మథురలో ఉండకపోవచ్చన్న వార్తలను ఆమె ఖండించారు. నేనెక్కడికీ వెళ్లను, ఇల్లు కొనుక్కుని ఇక్కడే వుంటానని ఆమె విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మథురలో ఉండి పనిచేయడం నా అభిలాష, అందుకే ఇక్కడ ఓ ఇల్లు కొనుక్కుంటున్నాను.. ఇంటికొనుగోలు లావాదేవీలు దాదాపు తుదిదశలో ఉన్నాయన్నారు. మథుర, యమునానది దశను మార్చడమే తనముందున్న కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. కాగా ఆమె ఎన్నికల ప్రచారంలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. ఆమె ప్రసంగిస్తున్న వేదిక మధ్యలో పాక్షికంగా కుంగిపోయింది. అయితే, ఈ సంఘటనలో ఆమె సురక్షితంగా తప్పించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu