Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమర్శలు వద్దు.. ప్రియాంకకు మేనకా గాంధీ హితవు!

విమర్శలు వద్దు.. ప్రియాంకకు మేనకా గాంధీ హితవు!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:14 IST)
File
FILE
తన కుమారుడు, భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీపై విమర్శలు మాని ప్రచారంపై దృష్టిసారించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా వాద్రా గాంధీకి బీజేపీ మహిళా నేత మేనకా గాంధీ హితవు పలికారు. ఫిలిబిత్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనక గాంధీ.. తన కుమారుడిపై ప్రియాంకా చేసిన విమర్శలపై స్పందించారు.

2014 ఎన్నికలు మన రెండు కుటుంబాల మధ్యో, లేక ఆక్కా, తమ్ముళ్ల మధ్యో పోటీ కాదన్నారు. ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ వరుణ్ గాంధీ బీజేపీ తరపున పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోందని ఆమె అన్నారు.

ప్రియాంక గాంధీ మాటలు కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్న ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో ఏ సిద్ధాంతాలు పాటిస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు అన్ని విషయాలను ప్రతిఫలిస్తాయని మేనక గాంధీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu