Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సహ నటి ఇంట్లో నగల చోరీ కేసులో కన్నడ నటి అరెస్టు!

సహ నటి ఇంట్లో నగల చోరీ కేసులో కన్నడ నటి అరెస్టు!
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (11:14 IST)
File
FILE
కర్ణాటక రాష్ట్రంలో సహ నటి, టీవీ టెక్నీషియన్ అయిన తన స్నేహితురాలి ఇంట్లో ఆభరణాల చోరీకి పాల్పడిన బుల్లితెర నటి సుజాతను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది.

మాంగల్య, రంగోలి తదితర సీరియల్స్‌లో సుజాత బస్వరాజ్ (40) అనే నటి నటించింది. ఈమె స్నేహితురాలు కవిత కూడా బుల్లితెర టెక్నీషియన్. వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఈ నేపథ్యంలో.. కవన ఇంటికి వస్తూపోతూ ఆమె ఇంట్లోని 1.75 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను చోరీ చేశారు.

దీనిపై కవన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన స్నేహితురాలు సుజాతే ఆ చోరీ చేసినట్లు తేల్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో తానే ఆ నగలను దొంగిలించినట్లు ఆమె ఒప్పుకుంది.

Share this Story:

Follow Webdunia telugu