Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ రాజకీయ హింసపై మంత్రి చిదంబరం ఆగ్రహం!!

Webdunia
వామపక్ష పాలిత రాష్ట్రమైన పశ్చిమబెంగాల్‌లో రాజకీయ హింస పట్ల కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హింసకు అడ్డుకట్ట వేయాల్సిందేనని బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు చిదంబరం తేల్చి చెప్పారు.

బుధవారం న్యూఢిల్లో చిదంబరం-భట్టాచార్యల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా చిదంబరం తన మనస్సులోని మాటను బుద్ధదేవ్‌కు నిర్మొహమాటంగా వెల్లడించారు. వామపక్ష పార్టీలకు చెందిన సాయుధ బలగాలు శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని ఆయన నొక్కివక్కాణించారు.

గత కొన్ని రోజులుగా బెంగాల్‌లో సీపీఎం కార్యకర్తలు రెచ్చిపోతున్న విషయం తెల్సిందే. తమకు ఎదురుతిరిగిన గ్రామస్తులను నిర్ధాక్షిణ్యంగా కాల్చివేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీకి అధిక ప్రాధాన్యత ఏర్పడింది.

చిదంబరం ఆహ్వానం మేరకు నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న బుద్ధదేవ్... రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. ముఖ్యంగా ఈ నెల 7న నేతాయ్ ప్రాంతంలో సీపీఎం కార్యకర్తల కాల్పుల్లో ఏడుగురు మృతి చెందిన ఘటనపై వారివురూ చర్చించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments