Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌కు గర్వమెక్కువా...? కాస్త తగ్గకపోతే... పార్టీ గోవిందా?!

జగన్‌కు గర్వమెక్కువా...? కాస్త తగ్గకపోతే... పార్టీ గోవిందా?!
, గురువారం, 30 జనవరి 2014 (16:53 IST)
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి గర్వమెక్కువా? అహం ఎక్కువా? అంటే పార్టీ శ్రేణుల్లో అవుననే సమాధానమే వస్తోంది. ప్రజల్లో తిరిగేటప్పుడు సామాన్యుడిగా కనిపించే జగన్‌కు.. పార్టీ లీడర్‌గా కనిపించే జగన్‌కు చాలా తేడాలున్నాయని వైకాపా శ్రేణుల్లో టాక్.

ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీలో నేతల మధ్య మనస్పర్థలు, లుకలుకలు ఉన్న మాట నిజమేనని ఆ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అంగీకరించారు. వైకాపా నుంచి పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంపై దృష్టి సారించామని, అన్ని పార్టీల్లో ఉన్నట్లే తమ పార్టీలోనూ విభేధాలున్నాయని మేకపాటి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో జగన్‌ మొండి వైఖరితోనే పార్టీకి తగిన గుర్తింపు రావట్లేదని, పార్టీతో పాటు జగన్ పరపతి కూడా మెల్లమెల్లగా పడిపోతోందన్న వాదన బలంగా ప్రచారం జరుగుతోంది.

సీనియర్లకు జగన్ గౌరవమివ్వకపోవడంతో పాటు తాననే అహంతో జగన్ ప్రవర్తిస్తున్నారని, తద్వారా పార్టీ ఇప్పటికే ఎంతో ప్రాభవాన్ని కోల్పోయిందని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ తీరు నచ్చకపోవడంతోనే జగన్‌తో సోదరిలా అంటిపెట్టుకుని వున్న కొండా సురేఖ దంపతులు పార్టీని వీడారని, ఇదే బాటలోనే మరికొందరు పార్టీని వీడాలనుకుంటున్నారని సమాచారం.

మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలోనూ ఇదే జరిగిందని, ధర్మాన తన వెంట భారీ ఓట్లు ఉన్నాయని చెప్తే జగన్ నిర్లక్ష్యంగా లెక్కచేయలేదని ప్రచారం జరుగుతోంది. జగన్ వాలకం నచ్చకనే ధర్మాన కూడా వైకాపా వైపు చూడలేదని సమాచారం.

ఇదే తంతు కొనసాగితే మాత్రం జగన్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని, ఇంకా జగన్ పట్ల జరుగుతున్న ప్రచారానికి యువనేత అడ్డుకట్ట వేసి పార్టీని ఒకే తాటిపై నడిపించేందుకు చర్యలు తీసుకోనట్లయితే 2014 ఎన్నికల్లో పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చునని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu