Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీనా దావులూరితో హద్దుమీరిన విద్యార్థి... డేటింగ్ చేయాలని ప్రపోజ్!

నీనా దావులూరితో హద్దుమీరిన విద్యార్థి... డేటింగ్ చేయాలని ప్రపోజ్!
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (10:25 IST)
FILE
భారత సంతతికి చెందిన అమెరికా అమ్మాయి, మిస్ అమెరికా నీనా దావులూరితో హద్దుమీరి మాట్లాడిన 18 ఏళ్ల పాట్రిక్ ఫార్వ్స్‌ అనే విద్యార్థిని ఆ స్కూలు యాజమాన్యం మూడు రోజులు సస్పెండ్ చేసింది. నీనా నాతో డేటింగ్ చేస్తావా అని ఆ విద్యార్థి అడగడంతో సీరియస్ అయిన స్కూలు యాజమాన్యం అతడిని సస్పెండ్ చేసింది.

అయితే ఆ విషయం తెలుసుకున్న నీనా అతడిపై సస్పెండ్ ఎత్తివేయాలని ఆదివారం తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. నీనా గురువారం ఓ ఆ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రంమంలో భాగంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి ప్రశ్నావళి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ విద్యార్థి ఒక ప్లాస్టిక్ గులాబీ పువ్వుతో స్టేజిపైకి వచ్చి ఆ ప్రతిపాదన చేశాడు. ఇది విన్న వెంటనే 24 ఏళ్ల నీనా ఆశ్చర్యపోయి, తర్వాత దరహాసం చేస్తూ ఉండిపోయింది.

ఈ ఆకతాయి చేష్టను ఆ పాఠశాల యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఆ విద్యార్థిని మూడురోజుల పాటు సస్పెండ్ చేసింది. ఆ విద్యార్థి తమ మాటను లెక్కచేయకుండా ప్రవర్తించాడని యాజమాన్యం చెప్పింది. ఆ విద్యార్థి మాట్లాడుతూ.. కొంత మంది ఒత్తిడి చేయడం వల్లే తానీపని చేశానని చెప్పాడు. ఆ తర్వాత క్షమాపణ కోరుతూ అధికారులకు లేఖ రాశాడు.

Share this Story:

Follow Webdunia telugu