Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిరియాలో ఐక్యరాజ్య సమితి తనిఖీ బృందంపై కాల్పులు

సిరియాలో ఐక్యరాజ్య సమితి తనిఖీ బృందంపై కాల్పులు
, మంగళవారం, 27 ఆగస్టు 2013 (10:48 IST)
File
FILE
సిరియాలో ప్రభుత్వ బలగాలు శృతిమించి పోతున్నాయి. ఇటీవల తిరుగుబాటుదారుల శిబిరాలపై రసాయన దాడులు జరిపిన సిరియా ప్రభుత్వ బలగాలు.. తాజాగా ఆ దేశ రాజధాని డమాస్కస్‌లో తనిఖీలు చేస్తున్న ఐక్యరాజ్య సమితి బృందంపై కాల్పులకు తెగబడ్డాయి. అయితే, ఈ కాల్పులను గుర్తు తెలియని వ్యక్తి చేసినట్టు సమాచారం.

రసాయనిక ఆయుధాల వినియోగంపై ఆధారాలు లభిస్తే, సైనిక చర్యకు సిద్ధపడతామంటూ ఒకవైపు పాశ్చాత్య దేశాలు సిరియాను హెచ్చరిస్తుండగా, ఐరాస తనిఖీ బృందంపై కాల్పులు జరపడం గమనార్హం. ఆ తర్వాత ఐరాస బృందం మోదామియేత్ అల్ షామ్ పట్టణంలో బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి, బాధితులకు చెందిన నమూనాలను సేకరించింది.

Share this Story:

Follow Webdunia telugu