Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోబెల్ బహుమతి గ్రహీత రామకృష్ణన్‌కు బ్రిటన్ "నైట్‌హుడ్"

నోబెల్ బహుమతి గ్రహీత రామకృష్ణన్‌కు బ్రిటన్
, ఆదివారం, 1 జనవరి 2012 (10:58 IST)
భారత్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత రామకృష్ణన్‌కు బ్రిటన్‌ దేశం ప్రదానం చేసే వ్యక్తిగత అత్యున్నత పురస్కారమైన నైట్‌హుడ్ దక్కింది. 58 సంవత్సరాల రామకృష్ణన్ కేంబ్రిడ్జిలోని ఎంఆర్‌సీ లేబొరేటరీలో కణజీవశాస్త్రంపై విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. ఈ పరిశోధనలకు ఆయనకు నోబెల్ పురస్కారం దక్కింది.

ఈ నేపథ్యంలో కణజీవశాస్త్రంలో వెంకీ అందించిన విశిష్ట సేవలకుగానూ నైట్‌హుడ్ పురస్కారాన్ని అందచేస్తున్నట్లు "2012 కొత్తసంవత్సర పురస్కారాల జాబితా"లో బ్రిటన్ తెలిపింది. బ్రిటన్‌కు ఇమ్మిగ్రేషన్లపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఈ బిరుదు తనకు దక్కటం వలసదారులు బ్రిటన్ సమాజానికి చేసిన సేవలను ప్రతిబింభిస్తోందని ఈ సందర్భంగా రామకృష్ణన్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu