Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముల్లా ఒమర్‌కు గుండెపోటు: సాయపడిన పాక్ ఐఎస్ఐ

ముల్లా ఒమర్‌కు గుండెపోటు: సాయపడిన పాక్ ఐఎస్ఐ
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ తీవ్రవాద సంస్థ నేత ముల్లా ఒమర్ ఇటీవల గుండెపోటుకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఓమర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు చేసినట్టు ఎక్లిప్స్ గ్రూప్ అనే ప్రైవేట్ గూఢచార సంస్థ వెల్లడించింది.

ముల్లా ఒమర్ కోసం అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు తీవ్రంగా గాలిస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే ఒమర్‌కు గుండెపోటు రాగా, ఆయనను ఆస్పత్రికి పాక్ ఐఎస్ఐ తరలించి వైద్యం ఇప్పించినట్టు ఆ గూఢచార సంస్థ కనిపెట్టింది. అయితే పాకిస్థాన్ ఈ విషయాన్ని ఖండించింది. ఈ సమాచారం పూర్తిగా నిరాధారమైనదని అమెరికాలోని పాక్ రాయబారి హుసేన్ హక్కానీ ఆ వెంటనే ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu