Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంద మంది బిడ్డలకు తండ్రి కావడమే లక్ష్యం: అబ్దుల్

వంద మంది బిడ్డలకు తండ్రి కావడమే లక్ష్యం: అబ్దుల్
నేటి ఆధునిక కాలంలో ఇద్దరు ముగ్గురు పిల్లలను పోషించడమే గగనమైపోతున్న తరుణంలో అబుదాబీకి చెందిన ఒక ఆసామీ ఏకంగా 100 మంది పిల్లలకు తండ్రి కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే 64 సంవత్సరాల వయస్సులోనూ మరో వివాహం చేసుకున్నాడూ ఈ అబుదాబీకి చెందిన అబ్దుల్ రెహ్మాన్ అనే వృద్ధుడు.

ఇప్పటి వరకు చేసుకున్న వివాహాల ద్వారా యాభై మంది బాలురు, 38 మంది బాలికలకు తండ్రి అయ్యాడు. అయితే, తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో 12 మంది బిడ్డలు కావాల్సి ఉండటంతో ప్రస్తుతం 18 సంవత్సరాల వయస్సున్న రాజస్థాన్‌కు చెందిన ఆయేషా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంతో తమ లక్ష్యాన్ని చేరుకుంటాననే ధీమాను వ్యక్తం చేశాడు.

అదేసమయంలో ఇకపై వివాహాలు చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన స్పష్టం చేశాడు. ఈ వివాహంపై యువతి తల్లిదండ్రులు స్పందిస్తూ భారతీయ డాక్టర్‌కు చెందిన ఒక వైద్యుడి సహకారంతో ఈ పెళ్లి జరుగుతున్నట్టు చెప్పారు. అనంతరం ఈ వివాహంపై కొత్త పెళ్లికొడుకు మాట్లాడుతూ అమ్మాయి ఫోటో చూసిన వెంటనే బాగా నచ్చిందని, వెంటనే వీసా తీసుకుని భారత్‌కు వచ్చి వివాహం చేసుకున్నట్టు చెప్పారు. ఈ వివాహం కోసం యువతి తండ్రికి 20 వేల దిహార్‌లు ఎదురుకట్నం ఇచ్చినట్టు అబుదాబీ ఆసామీ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu