Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదులకు ఉరి శిక్ష: బంగ్లాదేశ్

ఉగ్రవాదులకు ఉరి శిక్ష: బంగ్లాదేశ్
తమదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్గొన్నట్టు నిరూపించబడితే వారికి మరణశిక్ష విధించే ఓ ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఉగ్రవాదులుగా నిరూపించబడిన వారికి మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది.

అలాగే ఈ ఆర్డినెస్స్ ప్రకారం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారిని సైతం విడిచిపెట్టరు. వారికి మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రభుత్వం ఏ తీవ్రవదా సంస్థనైనా నిషేధించే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం ఈ ఆర్డినెస్సుకు ఆమోదం తెలిపినా గతంలో సైన్యం సహకారంతో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వమే దీనిని రూపొందించడం విశేషం.

అదేసమయంలో ఈ ఆర్డినెన్సును ఆమోదిస్తే దీని పరిధిలోకి వచ్చే నేరాలన్నీ శిక్షార్హమైనవిగాను, నాన్‌బెయిల్‌బుల్‌గాను మారిపోతాయని, వీటిని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి దీని విషయంలో ఆలోచించాల్సిందిగా నిపుణుల కమిటీ పేర్కొంది. అయితే హసీనా ప్రభుత్వం మాత్రం ఈ ఆర్డినెన్సును అమలు చేయడానికే మొగ్గు చూపింది.

Share this Story:

Follow Webdunia telugu