Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్ ఎంట్రీ... మూడు పెళ్లిళ్ల గోలతో తడికో తడిక...?

పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్ ఎంట్రీ... మూడు పెళ్లిళ్ల గోలతో తడికో తడిక...?
, శుక్రవారం, 14 మార్చి 2014 (15:53 IST)
FILE
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నటుల పర్సనల్‌ లైఫ్‌కి, పబ్లిక్‌ లైఫ్‌కి మధ్య తేడా ఉండదు. రాజకీయ రంగంలో అడుగు పెట్టిన తర్వాత చిరంజీవి ఏ స్థాయిలో చిన్నబోయాడో చూసారు కాబట్టి కెరీర్‌లో పీక్‌ స్టేజ్‌లో ఉన్న పవన్‌ ఇప్పుడీ స్టెప్‌ తీసుకోవడం అభిమానులకి రుచించడం లేదు. ఆల్రెడీ కెసిఆర్‌ లాంటి వాళ్లు పవన్‌ కళ్యాణ్‌ గురించి కామెడీ చేస్తున్నారు. ఇక పవన్‌ డైరెక్టుగా పార్టీ అనౌన్స్‌ చేసినట్టయితే ప్రతి ఒక్కడూ రాయి వేసేయడం మొదలవుతుంది.

చిరంజీవి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. వ్యక్తిగతంగా ఎంతో క్రమశిక్షణ ఉన్న చిరంజీవికే తడికలు కట్టారు. ఇక ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్న పవన్‌ గురించి ఎన్ని కామెంట్స్‌ చేస్తారో? హీరోగా ఉన్నంతవరకు అతను ఎన్ని వేషాలు వేసినా, ఎవరితో ఉన్నా పెద్దగా పట్టించుకోరు కానీ రాజకీయాల్లో అడుగుపెట్టి, వేరే వారిపై విమర్శలు చేస్తే మాత్రం ఎవరు ఊరుకుంటారు? తన వ్యక్తిగత విషయాల గురించే కాకుండా పవన్‌ కళ్యాణ్‌ తన అన్నయ్య విషయంలో ఎలా స్పందిస్తాడనేది కూడా చర్చనీయాంశమైంది.

పవన్‌ రాజకీయాల్లోకి వస్తాడనేది ఆసక్తికరంగా మారిపోవడానికి కారణం కూడా చిరంజీవే. అన్నయ్యకి వ్యతిరేకంగా తమ్ముడు ఎలా మాట్లాడతాడనేది అందరినీ ఆకర్షిస్తోంది. ఏదేమైనా కానీ ఈ రాజకీయ రొంపిలో దిగిన తర్వాత పవన్‌ నలిగిపోవడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. దీనికంటే అతను పాలిటిక్స్‌కి దూరంగా ఉంటూ ప్రజలకి చేతనైన సేవ చేసుకుంటే మేలని అనుకుంటున్నారు. పవన్‌ డై హార్డ్‌ ఫాన్స్‌ ఫీలింగ్‌ కూడా ఇదేనంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu