Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైలులో జగన్ దీక్షకు రెడీ... విభజనలో సమన్యాయం ఎలా తిరుమలేశా...?

జైలులో జగన్ దీక్షకు రెడీ... విభజనలో సమన్యాయం ఎలా తిరుమలేశా...?
, శనివారం, 24 ఆగస్టు 2013 (15:57 IST)
FILE
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్న తీరు సరిగా లేదనీ, చేతకాకపోతే విభజించడం మానేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఈసరికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా చంచల్ గూడ జైలు నుంచే నిరాహార దీక్ష చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

సమన్యాయం చేయలేనపుడు అసలు విడగొట్టే అధికారం లేదన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదన. తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి వాదనే చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు, సీట్లు కోసమే తెలంగాణ ఏర్పాటుకు సన్నద్ధమైంది తప్పించి ఒక ఆరోగ్యకరమయిన వాతావరణంలో విభజన చేయాలని ప్రయత్నించడం లేదని ఆ పార్టీ విమర్శిస్తోంది.

రెండు పార్టీల వాదనలు దాదాపు ఒకటేగా ఉన్నాయి. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు అసలు సమన్యాయం ఎలా చేయాలన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నపై ఒకపక్క చర్చ జరుగుతూనే ఉంది. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి శైలజానాథ్ స్పందించారు. సమన్యాయం అంటే... రాష్ట్రాన్ని ఏంచేయాలి...? స్కేలు పెట్టి కొలిచి రెండు అర్థభాగాలుగా చీల్చాలా...? అంటూ ఛలోక్తి విసిరారు.

మంత్రిగారి ప్రశ్న సూటిగానే ఉంది. సమన్యాయం అని వైకాపా చెపుతున్నట్లు కానీ, విభజించే తీరు ఇదేనా అంటూ తెదేపా చీఫ్ చంద్రబాబు అనడాన్ని కానీ చూస్తే అసలు ఏ తీరును సమన్యాయం చేయాలన్నది వైకాపా నాయకులు చెప్పడం లేదు. ఇలా చేయాలని కేంద్రానికి స్పష్టంగా తెలియజెప్పిన దాఖలాలు అయితే కన్పించడంలేదు. ఇకపోతే తెదేపా వ్యవహారం... విభజించి తీరు ఇదికాదు అని చెపుతున్న పార్టీ... ఏ తీరున విభజించాలన్నది మాత్రం చెప్పడంలేదు. ఇవే ఇప్పుడు చిక్కుప్రశ్నలుగా ఉన్నాయి.

ఇకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సమైక్యంగా ఉండాల్సిందేనంటూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, వైకాపాలు మాత్రం కర్ర విరగదు... పాము చావదు అన్నట్లు స్టేట్మెంట్లు ఇస్తూ ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటనతో ముందుకు వెళతారో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu