Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాల్లో వుంటా... సినిమాలు చేస్తా: పవన్ కల్యాణ్!

రాజకీయాల్లో వుంటా... సినిమాలు చేస్తా: పవన్ కల్యాణ్!
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:44 IST)
FILE
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇక ఆయన సినిమాల్లో నటించడం కష్టమే అని అభిమానులు ఎంతో నిరాశచెందారు. అయితే ఇపుడు పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించే విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్ నదర్ జిల్లాలో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ ప్రచార సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ప్రజల తరపున రాజకీయాలను ప్రశ్నించేందుకే జనసేన పార్టీ స్థాపించి మీ ముందుకు వచ్చానని అన్నారు. అలాగే, ఇక ముందు కూడా సినిమాలు చేస్తా, రాజకీయాల్లో కూడా ఉంటా అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వీరుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందని, కానీ కొందరు తమవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారని, టీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాలేదని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu