Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ ఓ హిట్లర్... చంద్రబాబుది ఆఖర్ ఫైట్ : చిరంజీవి

మోడీ ఓ హిట్లర్... చంద్రబాబుది ఆఖర్ ఫైట్ : చిరంజీవి
, బుధవారం, 23 ఏప్రియల్ 2014 (11:07 IST)
File
FILE
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఓ హిట్లర్ అని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది ఆఖరి పోరాటమని కేంద్ర మంత్రి, సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి చిరంజీవి ధ్వజమెత్తారు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఆఖరి పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన పని ఖతమని జోస్యం చెప్పారు. అందుకే అధికారం కోసం హిట్లర్ లాంటి మోడీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.

నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదని... అన్ని పార్టీలు తమ సమ్మతిని తెలిపినందుకే రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu