Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తప్పుడు సమాచారం : కోమటిరెడ్డికి హైకోర్టు నోటీసు!

తప్పుడు సమాచారం : కోమటిరెడ్డికి హైకోర్టు నోటీసు!
, బుధవారం, 23 ఏప్రియల్ 2014 (10:19 IST)
IFM
FILE
నల్లగొండ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాష్ట్ర హైకోర్టు నోటీసు జారీ చేసింది. తాను సమర్పించిన ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారమిచ్చినట్టు ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది.

బీఈలో ఉత్తీర్ణత సాధించకపోయినా, సాధించినట్టు పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

నామినేషన్ పత్రాల్లో బీఈ ఉత్తీర్ణులైనట్టు వెంకటరెడ్డి పేర్కొన్నారని, అయితే ఆయన ఉత్తీర్ణులు కాలేదని ఆధారాలను చూపినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని టీఆర్‌ఎస్ అభ్యర్థి దుబ్బాక నరసింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

Share this Story:

Follow Webdunia telugu