Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ నోరు మంచిది కాదు.. తస్మాత్ జాగ్రత్త : పవన్

కేసీఆర్ నోరు మంచిది కాదు.. తస్మాత్ జాగ్రత్త : పవన్
, మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (15:18 IST)
File
FILE
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు, మౌలికవసతులు కావాలని... అవి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆసరా తప్పక ఉండాలని చెప్పారు. కానీ నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత ఉందన్నారు. దీనికి కేసీఆర్ ఏమాత్రం సరిపోరన్నారు. ఎందుకంటే.. కేసీఆర్ నోరు మంచిది కాదన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాబోయే ప్రతి ఒక్కరినీ పరుష పదజాలంతో దూషించడం వల్ల మనకు న్యాయం జరుగుతుందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అందువల్ల కేంద్రంలో రాబోయే ప్రభుత్వం ఎన్డీయేతో పాటు.. పాటు.. కాబోయే ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోడీ మద్దతు అవసరమన్నారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తిట్టడం అలవాటని... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని హితవు పలికారు. మోడీ లేదు, గీడీ లేదు అని గతంలో కేసీఆర్ అన్నారని... అలాంటప్పుడు, రేపు మోడీ ప్రధాని అయితే తెలంగాణకు కేసీఆర్ ఏమి సాధిస్తాడని ప్రశ్నించారు. జిల్లాకో విమానాశ్రయం వచ్చేలా చేస్తానని హామీలిస్తున్న కేసీఆర్... కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా విమానాశ్రయాలు నిర్మిస్తారా అంటూ ఎద్దేవా చేశారు.

మాటలు తప్ప, సిద్ధాంతాలు లేని కేసీఆర్ లాంటి నేతల చేతిలో తెలంగాణను పెడితే... తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. బాధ్యత లేని నాయకులకు తెలంగాణను అప్పగిస్తే... ఈ ప్రాంతం మరో 20 ఏళ్లు వెనక్కు వెళుతుందని చెప్పారు. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అని చెప్పారు. ఈ విషయాన్ని తన మససులోనే ఉంచుకున్నాను కాని, ఎప్పుడూ ఢంకా భజాయించి చెప్పలేదని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ ఎలా వచ్చిందనే విషయం కన్నా వచ్చిన తెలంగాణను ఎలా పాలించాలనే దానిపైనే మాట్లాడుకోవాలని చెప్పారు. తాము పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని కొందరు చెబుతున్నారని... కానీ, కొందరు యువకుల బలిదానాలు, పోరాటాల వల్లే తెలంగాణ సాధ్యమైందని పరోక్షంగా టీఆర్ఎస్‌పై సెటైర్ విసిరారు. రోజుకు ఇద్దరు, ముగ్గురు చనిపోతుంటే తెలంగాణ ఇవ్వాలని ఎందుకు అనిపించలేదని కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు. కులాలు, మతాలన్నింటికీ సమాన న్యాయం చేయడమే జనసేన సిద్ధాంతమని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu