Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పవన్‌ది 'కోతి' మనసు... నిలకడగా ఉండదు: సుబ్బరామిరెడ్డి విమర్శ!

'పవన్‌ది 'కోతి' మనసు... నిలకడగా ఉండదు: సుబ్బరామిరెడ్డి విమర్శ!
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (12:32 IST)
FILE
'జనసేన' పార్టీ అధ్యకుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ మనసు 'కోతి' లాంటి మనసు అని, కోతి ఎలా నిలకడగా ఉండదో పవన్ కళ్యాణ్ మనసు కూడా అంతేననీ, ఆయనకు కనీస రాజకీయ అవగాహన లేదని అలాంటి వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడటం చిత్రంగా ఉందన్నారు.

బయటిప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇంటికే పరిమితమైన వ్యక్తి ఒక్కసారిగా బయటికి వచ్చేసి దేశానికి సేవ చేస్తానంటే నమ్మగలమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించేముందు పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.

చిరంజీవి అన్నయ్యకు ఎదురు చెబుతానా అంటూనే ఆయన ఉన్న పార్టీని విమర్శించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర విభజన తీరుపై మండిపడే పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజనకు కారకుడయిన నరేంద్ర మోడీ పార్టీ భాజపాను ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడంలేదని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu