Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ చీఫ్ చంద్రబాబు హిట్లర్‌తో సమానం : వైఎస్ షర్మిల

టీడీపీ చీఫ్ చంద్రబాబు హిట్లర్‌తో సమానం : వైఎస్ షర్మిల
, ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (13:53 IST)
File
FILE
హిట్లర్ ఎంత నియంతో... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంతే నియంత అని వైఎస్ఆర్ సీపీ మహిళా నేత వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. హిట్లర్‌కు ఎంత అధికార దాహమో చంద్రబాబుకూ అంతే అధికార దాహమన్నారు. ఇద్దరూ ఒకే రోజున పుట్టారని ఆమె తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హైదరాబాదులోని యూసఫ్ గూడలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఓడిపోతాననే భయంతో చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి తెరలేపారని ఆమె ఆరోపించారు.

హైటెక్ సిటీ ఒక్కటి కట్టి హైదరాబాదు మొత్తం తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాడు జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎంజీకి అప్పనంగా భూములు కట్టబెట్టింది చంద్రబాబేనని షర్మిల ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu