Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌ కళ్యాణ్ కు నిజంగానే తిక్కుందా...?

పవన్‌ కళ్యాణ్ కు నిజంగానే తిక్కుందా...?
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (20:15 IST)
WD
నాకు తిక్కుంది... దానికి లెక్కుంది.. అంటూ గబ్బర్‌సింగ్‌లో పలికిన డైలాగ్‌లు నిజంగానే పవన్ కు సరిపోతాయంటున్నారు. జనసేన పార్టీ పెట్టి తన తరఫున వారిని వీరిని సపోర్ట్‌ చేస్తూ ఓటు వేయమని అడుగుతుండటంపై అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు. కాంగ్రెస్‌ హఠావో దేశ్ బచావో అంటూ.. నోరెత్తి అరిచి బిజెపికి సపోర్ట్‌గా మాట్లాడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ వెబ్‌సైట్‌లోనూ చెర్రీ, బన్నీ ఫేస్‌బుక్‌ల్లోనూ అభిమానులు పవన్‌ గురించి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.

కర్నాటకలో అంతకుముందటి బిజెపి ప్రభుత్వం అవినీతి రొంపిలో కొట్టుకుపోయింది. అలాంటి పార్టీకి చెందిన అభ్యర్థులకు పవన్‌ ఇప్పుడు సపోర్ట్‌ చేసి మాట్లాడటం.. ఎంతవరకు కరెక్ట్‌ అనేది అభిమానుల ప్రశ్న. మరోవైపు పీవీపీ.. జగన్‌ ఆస్తుల కేసులో వివాదాలతో ముడివడి ఉన్నారనేది తెలిసిందే. పవన్‌ ఆయనకి సపోర్ట్‌గా ఉండటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.

కానీ తాను మోడీకి మద్దతు ఇచ్చాను మినహా బిజెపి వ్యక్తికి కాదని లాజిక్‌గా మాట్లాడటం సినిమాటిక్‌గా ఉందని అంటున్నారు. ఏదిఏమైనా.. పవన్‌ రాజకీయరంగం చరిత్రలో మిగిలిపోతుందో లేదంటే చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu