Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్, కిరణ్ పోటీ చేయట్లేదు... కిరణ్ పార్టీ హేమ అజ్ఞాతం ఎందుకు?

పవన్, కిరణ్ పోటీ చేయట్లేదు... కిరణ్ పార్టీ హేమ అజ్ఞాతం ఎందుకు?
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (17:29 IST)
WD
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ చెరో పార్టీ అంటే... జనసేన, జై సమైక్యాంధ్ర పార్టీలను నెలకొల్పారు. వీరిద్దరి పార్టీల మధ్య చిన్నచిన్న తేడాలతోపాటు కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందే పార్టీలు స్థాపించిన వీరిద్దరూ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ తమ బద్దశత్రువని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా ఎన్నికలు 2014లో పోటీ చేయడంలేదు. కిరణ్ రాష్ట్ర సమైక్యమంటుంటే పవన్ దేశ సమగ్రత అంటున్నారు.

వీరిద్దరి సంగతి ఇలావుంటే జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేస్తానని చెప్పిన సినీ నటి హేమ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందట. తాను జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించడంతో జైసపా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రత్యర్థి పార్టీలకే కాకుండా తమ పార్టీకి కూడా సినీగ్లామర్ తోడవడంతో పార్టీకి ఎంతగానో కలిసివస్తుందనుకున్నారు. కానీ ఇపుడు ఆ పార్టీ నేతల ఆశలు అడియాశలయ్యాయి. తాను పోటీ చేస్తానని హేమ ప్రకటించిన కొద్దిసేపటికే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆమె జైసపా తరపున పోటీ చేస్తారని తెలియడంతో చిత్రపరిశ్రమ ప్రముఖుల నుంచి హేమపై ఒత్తిడి పెరగడంతో ఆమె వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. చివరకు హేమ తన సెల్‌ఫోన్‌ను కూడా స్వీచాఫ్ చేశారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆశీస్సులతో హేమ శనివారం నామినేషన్ వేయాలనుకున్నట్లు సమాచారం. కాగా హేమ తమ పార్టీనుంచి పోటీ చేస్తే ఎంతగానో కలిసివస్తుందని భావించిన ఆ పార్టీ నేతల ఆశలు అడియాశలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu