Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురంధేశ్వరికి టిక్కెట్ ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు!

పురంధేశ్వరికి టిక్కెట్ ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:12 IST)
File
FILE
ఎట్టకేలకు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని కడప జిల్లా రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించి౦ది. 2009 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ప్రాతినిథ్యం వహించిన పురంధేశ్వరి... ఈ ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి టిక్కెట్ కావాలన్న షరతుపైనే బీజేపీలో చేరారు.

అయితే, విశాఖ లోక్‌సభ సీటు కంభంపాటి హరిబాబుకు దక్కడంతో విజయవాడ లేదా నర్సరావుపేట స్థానాల నుంచైనా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అవి కూడా పురంధేశ్వరికి దక్కకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చక్రం తిప్పినట్టు సమాచారం. దీంతో బీజేపీ అధినాయకత్వం ఆమెకు రాజంపేట సీటును కేటాయించింది.

వాస్తవానికి విశాఖపట్నం సీటును పురంధేశ్వరికి ఇవ్వాలని ఓ దశలో పార్టీ పెద్దలు భావించారు. అయితే, టీడీపీ నేతలు బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెకు విశాఖ దక్కకుండా చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమెకి ఒంగోలు సీటును బీజేపీకి ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది.

పురంధేశ్వరి కోసమే ఆ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు.. ఆ సీటును బీజేపికి కేటాయించలేదు. దీంతో బీజేపీకి దక్కిన నాలుగు స్థానాల్లోనే పురంధేశ్వరికి ఓ సీటును సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu