Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు కుర్చీపై కన్నేసిన హీరో నందమూరి బాలకృష్ణ

చంద్రబాబు కుర్చీపై కన్నేసిన హీరో నందమూరి బాలకృష్ణ
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (16:54 IST)
File
FILE
ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి సీటుపై కన్నేశారు. అవకాశమొస్తే సీఎం పదవి చేపడతానంటూ బాలకృష్ణ తన మనసులో మాటను బహిర్గతం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బుధవారం బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. హిందూపురంను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. సమయం కలిసివస్తే సీఎం పదవి చేపట్టడానికి సిద్దమన్న బాలకృష్ణ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu