Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ లొంగుబాటు : నేనే కాల్చిచంపా!

జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ లొంగుబాటు : నేనే కాల్చిచంపా!
, మంగళవారం, 27 ఆగస్టు 2013 (11:38 IST)
File
FILE
సోదరుని హత్య కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం. ముఖ్యంగా సోదరుని హత్యకు తన సొంత పిస్తోలుతోనే స్వయంగా మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో సోదరుడు జగన్ మోహన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని వెల్లడించారు.

గత జూలై నెల 17వ తేదీన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర జగన్ మోహన్ హత్య పాలమూరు జిల్లా దేవరకద్రలో జరిగింది. ఈ కేసులో సిట్టిగ్ ఎమ్మెల్యే, అన్న ఎర్ర శేఖర్ ప్రధాన నిందితుడుగా ఉన్నట్ట పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు.

హత్య జరిగిన అనంతరం ఎర్ర శేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో ఎర్ర శేఖర్ రెండు రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయి, హత్యకు ఎలా కుట్ర పన్నింది వాంగ్మూలం ఇచ్చాడు.

ఈ కేసు వివరాలపై జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. దేవరకద్ర మండలం సీసీకుంట సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎర్రశేఖర్ భార్య భవాని, తమ్ముడు జగన్‌ మోహన్ భార్య అశ్రితలు పోటీ చేయాలని నిర్ణయించి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆశ్రితను పోటీ నుంచి తప్పించాలని ఎర్రశేఖర్ సోదరుడిని కోరాడు.

అందుకు అతడు రూ.రెండు లక్షలు, వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశాడు. దీనికి అంగీకరించిన ఎమ్మెల్యే.. జగన్‌ మోహన్‌తో పాటు తన అనుచరులు తిమ్మన్న, రాములు, నర్సింహులు, సూర్యనారాయణ, రాజులను నామినేషన్ ఉపసంహరణకు కారులో దేవరకద్రకు పంపాడు.

అయితే, అప్పటికే నామినేషన్ ఉపసంహరణకు గడువు మించిపోవడంతో ఎర్ర శేఖర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత సోదరునితో పాటు.. తన అనుచరులను అక్కడే ఉండమని చెప్పి మహబూబ్‌నగర్ నుంచి ఎర్ర శేఖర్ ఒక్కడే దేవరకద్రకు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్ వద్ద ఉన్న సోదరుడిపై తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరపగా.. జగన్‌ మోహన్ ప్రాణాలు విడిచాడు.

అనంతరం ఎర్రశేఖర్ తన అనుచరులతో కలిసి పారిపోయాడు. కాగా, ఆదివారం ఎమ్మెల్యే అనుచరులు టి.తిమ్మన్న, దండు నర్సింహులు, టి.రాములు, బోనావత్ రమేష్ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య తామే చేశామని నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఎమ్మెల్యే తుపాకీ, కారుని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu